మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు తమదే గెలుపంటూ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.ఈ నేపథ్యంలో థర్డ్ విజన్ సంస్థ ఆసక్తికర సర్వేను విడుదల చేసింది.ఈ సర్వేలో భాగంగా టీఆర్ఎస్ పార్టీకి 43.66 శాతం, బీజేపీకి 32.39 శాతం, కాంగ్రెస్ కు 15.96 శాతం ఓట్లు వస్తాయని ప్రకటించింది.అక్టోబర్ 17 నుంచి 22 వరకు 200 బూత్స్ లో 3,556 మందిని థర్డ్ విజన్ సంస్థ సర్వే చేసినట్లు సమాచారం.అదేవిధంగా ఇంకా తమ సర్వేలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.
టీఆర్ఎస్ కు ఓటింగ్ పర్సంటేజ్ 50 శాతానికి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.రెండో దశ సర్వేను ఈనెల 29న విడుదల చేస్తామని థర్డ్ విజన్ వెల్లడించింది.