పూరీ జగన్నాథ్ మొదటి మూవీ ఆగిపోయిందని మీకు తెలుసా.. అందులో హీరో ఎవరంటే?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో పూరీ జగన్నాథ్ కు పేరుంది.సినిమా సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా పూరీ జగన్నాథ్ సినిమాలు ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే సంగతి తెలిసిందే.

 Interesting Facts About Puri Jagannaath Krishna Combo Movie Details, Puri Jagann-TeluguStop.com

ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ సాధించిన పూరీ జగన్నాథ్ అంచనాలను మించిన బడ్జెట్ తో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.యంగ్ జనరేషన్ హీరోలతోనే పూరీ జగన్నాథ్ ఎక్కువగా సినిమాలను తెరకెక్కిస్తుండటం గమనార్హం.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఒక్కో సినిమాను తెరకెక్కించడానికి రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం తీసుకుంటుంటే పూరీ జగన్నాథ్ మాత్రం కేవలం 6 నెలల్లోనే షూటింగ్ ను పూర్తి చేస్తూ నిర్మాతలకు ఖర్చు తగ్గిస్తున్నారు.అయితే పూరీ జగన్నాథ్ తొలి సినిమా ఆగిపోయిందనే విషయం పూరీ అభిమానులలో చాలామందికి తెలియదు.కొన్నేళ్ల క్రితం సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది.

1996 సంవత్సరంలో కృష్ణ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కాల్సి ఉండగా పూరీ జగన్నాథ్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయం కావాల్సి ఉంది.

Telugu Puri Jagannath, Krishna, Krishna Puri, Mahesh Babu, Stopped, Pokiri-Movie

పూరీ టేకింగ్ నచ్చడంతో కృష్ణ ఛాన్స్ ఇవ్వగా ఆ సినిమాకు థిల్లానా అనే టైటిల్ ఫైనల్ అయింది.అయితే ఆర్థికపరమైన సమస్యల వల్ల ఈ సినిమా రెండుసార్లు వాయిదా పడి ఆగిపోయింది.ఈ విధంగా కృష్ణ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించే అవకాశాన్ని పూరీ జగన్నాథ్ మిస్ చేసుకున్నారు.

Telugu Puri Jagannath, Krishna, Krishna Puri, Mahesh Babu, Stopped, Pokiri-Movie

ఆ తర్వాత కృష్ణ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో మూవీ పట్టాలెక్కలేదు.అయితే సూపర్ స్టార్ కృష్ణతో తెరకెక్కించకపోయినా ఆయన కొడుకు మహేష్ బాబుతో పూరీ జగన్నాథ్ పోకిరి, బిజినెస్ మేన్ సినిమాలను తెరకెక్కించారు.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube