మనిషికి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం, కానీ పెరుగుతున్న కాలుష్యం, జనాభా, వాహనాల వాడకం వల్ల మనిషి రోగ నిరోధక శక్తి రోజురోజుకీ తగ్గిపోతుంది.అయితే కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ చాలా మంది ఆరోగ్యం మెరుగవ్వడానికి కారణమైంది.
ప్యాకేజ్డ్ ఫుడ్ దొరక్క తాజాగా జరిగిన రీసెర్చ్ లో జనాల్లో సగటున 22.3శాతం కొవ్వు తగ్గినట్లు తెలుస్తుంది.దీనికోసం 2019 చివరి నుండి 2020 పురుషులు మరియు స్త్రీల నుండి 50,000 నమూనాలు సమానంగా సేకరించి పరిశోధన చేసినట్లు చెబుతున్నారు.పురుషులలో 25.4 శాతం , స్త్రీలలో 17.2 శాతం కొవ్వు తగినట్లు వెల్లడైంది.దీనివల్ల జనాల్లో గుండె జబ్బులు తగ్గాయని దానికి కారణం లాక్ డౌన్ వల్ల జనాలు తీసుకున్న శ్రద్ధ, ఆహార పదార్ధాల నియమాలు అని తెలుస్తుంది.
లాక్ డౌన్ వల్ల నూనె పదార్ధాలు, కొవ్వు పదార్ధాలకు జనాలు దూరంగా ఉన్నారు.
మన జీవన శైలి మన జీవితం లో కీలక పాత్ర పోషిస్తుంది అని లాక్ డౌన్ వల్ల మళ్ళీ నిరూపితమైంది.కాగా లాక్ డౌన్ వల్ల వచ్చిన నష్టం తో పోలిస్తే ఎక్కువ మేలు జరిగింది అని అనుకోవచ్చు.