టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఎన్నో సినిమాలలో నటించిన సమంత తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా, అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టడంతో తన అభిమానులకు మరింత దగ్గరయ్యారు.కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు లేకపోవడంతో సమంత ఎప్పటికప్పుడు తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటున్నారు.
గత కొద్ది రోజులుగా హోం గార్డెన్ లో ఆమె పెంచిన కూరగాయలను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటున్నారు.అయితే మెగా కోడలు ఉపాసన, అక్కినేని కోడలు సమంత కలిసి “యు ఆర్ లైఫ్” అనే ప్లాట్ ఫార్మ్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్పూర్తి కలిగించేలా ఈ వెబ్ సైట్ ను ప్రారంభించినట్లు ఇదివరకే తెలిసిన విషయమే.
అయితే తాజాగా సమంత అక్కినేని మరొక రెసిపీ ని తయారు చేసే విధానాన్ని వీడియో తీసి ‘యూ ఆర్ లైఫ్’ అనే వెబ్ సైట్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.
అయితే ఈ రెసిపీ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల ఆరగ్యానికి ఎంతో మంచిదని చెప్పారు.ఈ వీడియో చూసిన సమంత అభిమానులు తను చేసిన వంటలకు వీరాభిమానులుగా మారిపోయారు.
అయితే ఈ వెబ్ సైట్ ప్రారంభించడానికి గల కారణం అందరకి సంపూర్ణమైన ఆహారపు అలవాట్లను, కొన్ని జీవన సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ వెబ్ సైట్ ను ప్రారంభించామని ఉపాసన కొణిదెల ఇదివరకే పేర్కొన్నారు.కాగా గతంలో కూడా ఉపాసన కొణిదెల న్యూట్రిషన్ పైన, ఆహారంపైన బిపాజిటివ్ అనే వెబ్ సైట్ ను ప్రారంభించగా అందులో కూడా మంచి ఆహారం గురించి బాగా రాశారు.
కానీ కొన్ని రోజులకే ఆ వెబ్ సైట్ ని ఆపేశారు ఉపాసన కొణిదెల.