తెలుగు బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.ఈ వారం లో భాగంగా మగవాళ్ళు అందరికీ కూడా గడ్డాలు మీసాలు తొలగించడం జరిగింది.
తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే అంతా కూడా గడ్డం మీసం తొలగించి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.మొదట ఒక్కరు ఇద్దరిని కనిపిస్తే మామూలుగా తీశారు ఏమో అనుకున్నాము.
కానీ అందరూ కూడా మీసాలు గడ్డాలు తీసేసారు ఈ విషయంలో బిగ్ బాస్ ఆదేశం అయ్యి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ రోజు సండే ఫన్ డే ఎపిసోడ్ సందర్భంగా అమ్మాయిలు అబ్బాయిలుగా.అబ్బాయిలు అమ్మాయిలుగా మారిపోతున్నారు.
అందుకే మగవాళ్ళు అంతా కూడా గడ్డాలు మీసాలు చేసినట్లుగా తెలుస్తోంది.ఈ రోజు మొత్తం ఎంటెర్టైన్మెంట్ ప్రేక్షకులకు ఇవ్వబోతున్నట్లు గా అనిపిస్తుంది.
నాగార్జున చాలా మంచిగా షో నడిపిస్తున్నాడు అంటూ ఇప్పటికే తారీకు వచ్చింది.
మరికొందరు మాత్రం తప్పు చేసిన వారి విషయంలో లైట్ గా ఉంటున్నాడు అంటూ వారికి తప్పును ఎత్తి చూపించకపోతే నాకెందుకు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు ఈ విషయంలో నాగార్జున మార్చుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బిగ్ బాస్ షో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసినందుకుగాను నిర్వాహకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.ఒకవైపు ఐపీఎల్ మరోవైపు కరోనా కారణంగానే ఈ విషయంలో ఇబ్బందిగా ఉంది అందుకే చాలా భిన్నమైన టాక్స్ లు మరియు విభిన్నమైన గేమ్స్ నిర్వహిస్తున్నారు.
ఇలా అయినా బిగ్ బాస్‌కు మొదటి వారం వచ్చిన రేటింగ్ వస్తుందా అంటే అనుమానమే అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
మరి ఎలిమినేట్ ఎవరు అంటే అంతా చెబుతున్నది స్వాతి.కాని ఆమె కూడా వెళ్లడం పద్దతిగా లేదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.