ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )కు ఊరట దక్కలేదు.ఎమ్మెల్సీ కవితను సీబీఐ( CBI ) విచారించడంపై స్టేటస్ కో ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
లిక్కర్ స్కాం కేసులో సీబీఐ విచారించడానికి అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ ను విచారించేందుకు ధర్మాసనం స్వీకరించగా… ఈ క్రమంలో సీబీఐ దరఖాస్తు తమకు అందలేదని కవిత తరపు న్యాయవాది తెలిపారు.
కాగా ఈ నెల 10వ తేదీన కవిత పిటిషన్ పై విచారణ జరుపుతామని రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) తెలిపింది.వాదనలు విని తదుపరి ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించింది.అయితే లిక్కర్ స్కాం కేసులో కవితను ప్రశ్నించేందుకు నిన్న సీబీఐకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.