సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నయనతార ( Nayanatara ) ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈమె గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ సాధించారు.
ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగాను కొనసాగుతున్నారు అలాగే తన భర్తతో కలిసి వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారు.ఇలా వృత్తి పరమైనటువంటి జీవితంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తన ఇద్దరు పిల్లలతో కలిసి వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు.
ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా కనిపించే నయనతార తరుచు తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.అయితే తాజాగా నయనతారకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో భాగంగా ఈమె అర్థరాత్రి పూట రోడ్డు పక్కన ఐస్ క్రీమ్( Ice cream )తింటూ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ వీడియోలో భాగంగా ఇద్దరు వ్యక్తులు కారు నుంచి దిగి ఎదురుగా ఉన్న నయనతార హోర్డింగ్ చూసి తన గురించి మాట్లాడుతూ ఉంటారు.పక్కకు తిరిగి చూడగానే నయనతార ఐస్ క్రీమ్ తింటూ కనిపించడంతో షాక్ అవుతారు.
ఇలా వారిద్దరు సరదాగా నయన తారతో కలిసి మాట్లాడుతూ ఐస్ క్రీమ్ తింటూ ఉన్నటువంటి ఈ వీడియో వైరల్ గా మారింది.అయితే వారిద్దరు కూడా నయనతార కజిన్స్ అని ఈ వీడియో నయనతార భర్త విగ్నేష్ ( Vignesh ) తీస్తున్నారని తెలుస్తోంది.ఇలా అర్ధరాత్రి పూట రోడ్డు పక్కన ఐస్ క్రీమ్ తింటూ ఈమె ఎంజాయ్ చేయడంతో నయనతారలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.