ఉపాసన బాటలోనే పయనిస్తున్న రకుల్.. కొత్త బిజినెస్ ప్రారంభం?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నటువంటి ఎంతో మంది సెలబ్రిటీలు కేవలం హీరోయిన్లుగా ఇండస్ట్రీలో కొనసాగడమే కాకుండా వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తూ వ్యాపార రంగంలో కూడా సక్సెస్ సాధించారు.

 Rakul Preeth Start New Cooking Business Like Upasana,upasana,rakul Preeth Singh,-TeluguStop.com

ఈ క్రమంలోనే నటి రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preeth Singh ) సైతం ఇప్పటికే పలు వ్యాపారాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Telugu Jacky Bhagnani, Rakulpreeth, Upasana-Movie

ఇక ఇటీవల ఈమె బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానిని( Jacky Bhagnani ) ప్రేమించి గోవాలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇలా వివాహం జరిగిన తర్వాత కూడా ఈమె కెరియర్ పరంగా బిజీ అయ్యారు.అయితే తాజాగా రకుల్ మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన వివరాలను ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.తాజాగా ఈమె టేస్ట్ ప్లస్ హెల్తీ అంటూ ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.

ఉగాది పండుగ నుంచి తన బిజినెస్ ప్రారంభం కాబోతుందని తెలిపారు.

Telugu Jacky Bhagnani, Rakulpreeth, Upasana-Movie

ఇలా రకుల్ టేస్ట్ ప్లస్ హెల్తీ అంటూ ఈ వీడియోని షేర్ చేయడంతో బహుశా ఈమె హెల్త్ టిప్స్ ఏమైనా చెబుతారా లేకపోతే మెగా కోడలు ఉపాసన ( Upasana ) మాదిరిగా టెస్ట్ తో పాటు ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ అందరికీ సప్లై చేసేలా సరికొత్త ఫుడ్ బిజినెస్ ఏమైనా ప్రారంభిస్తారా అన్న సందేహాలు అందరికీ వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే ఉపాసన ఎక్కడికి వెళ్లినా మన ఇంట్లో భోజనం తిన్నామనే సంతృప్తి కలగాలన్న ఉద్దేశంతోనే అత్తమ్మ కిచెన్స్ అంటూ ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా రకుల్ షేర్ చేసిన వీడియో చూస్తుంటే మాత్రం ఈమె కూడా ఉపాసన బాటలోనే ఫుడ్ బిజినెస్ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube