మోదీ అధికారంలోకి వస్తే దేశానికే ముప్పు..: మంత్రి ఉత్తమ్

తెలంగాణ కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.మోదీ ( Modi ) మరోసారి అధికారంలోకి వస్తే యావత్ దేశానికే ప్రమాదమని పేర్కొన్నారు.

 If Modi Comes To Power It Will Be A Threat To The Country Minister Uttam Details-TeluguStop.com

దర్యాప్తు సంస్థలతో కలిసి మోదీ ప్రతిపక్షాలను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి ఎన్నికల ప్రచారానికి ఇబ్బంది కలిగిస్తున్నారని పేర్కొన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) బీఆర్ఎస్ పోటీలోనే లేదన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి ఒక్క సీటు కూడా రాదని చెప్పారు.

ఈ లోక్ సభ ఎన్నికల తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ మిగలదని తెలిపారు.

అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 13 నుంచి 14 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఉనికికి ప్రమాదం వచ్చిందని కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube