అందాల ప్రదర్శన మాత్రమే కాదు ఏజెంట్స్ గా కూడా దుమ్ము దూలపనున్న హీరోయిన్స్

హీరోయిన్స్( Heroines ) అంటే కేవలం అందాల ప్రదర్శనకి మాత్రమే పనికి వస్తారు అని అపోహ ఒకప్పుడు ఉండేది.కానీ ఇప్పుడు అలా కాదు టాలెంట్ తో పాటు అందం కూడా ప్రతి హీరోయిన్ కి అవసరమే.

 Heroines And Their Agent Movies,alia Bhatt,samantha,citadel,kiara Advani,war 2,d-TeluguStop.com

అందుకోసం ఎలాంటి సాహసాలు చేయడానికి అయినా వెనకాడటం లేదు కొంతమంది నటీమణులు.మరీ ముఖ్యంగా గ్లామర్ డోస్ తగ్గించి ఏజెంట్ లాంటి పాత్రలకు కూడా సై అంటున్నారు.

ఇటీవల కాలంలో అలాంటి పాత్రలకు న్యాయం చేసే విధంగా కొంతమంది హీరోయిన్స్ ఇలాంటి ఏజెంట్ క్యారెక్టర్( Agent Character ) ఎంచుకుంటున్నారు.మరి ఆ హీరోయిన్స్ ఎవరు ? అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Character, Alia Bhatt, Citadel, Kiara Advani, Pathan, Samantha, War-Movie

సిటాడెల్ సినిమా( Citadel )తో సమంత( Samantha ) మరోమారు యాక్షన్ సన్నివేశాల్లో మెరువనుంది.ఆమె ఈ చిత్రంలో ఒక ఏజెంట్ పాత్రలో నటించబోతోంది.ఈ సినిమాలో ఆమెతో పాటు వరుణ్ ధావన్ కూడా ఏజెంట్ పాత్ర చేస్తున్నాడు.ఇక బాలీవుడ్ అందాల తార ఆలియా భట్( Alia Bhatt ) కూడా గత కొంతకాలంగా మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించడానికి ప్రయారిటీ ఇస్తుంది.

అందుకే అతి త్వరలో ఒక ఏజెంట్ పాత్ర ను చేయడానికి యశ్ చోప్రా ప్రొడక్షన్స్ కోసం ఓకే చేసింది.

Telugu Character, Alia Bhatt, Citadel, Kiara Advani, Pathan, Samantha, War-Movie

ఇక తారక్ మొట్టమొదటిసారి బాలీవుడ్ కోసం నటిస్తున్న వార్ 2 చిత్రంలోహ్రితిక్ మరియు తారక్ సరసన కియార అద్వానీ( Kiara Advani ) కూడా ఏజెంట్ పాత్రలో కనిపించబోతుందట.బాలీవుడ్ కి కరోనా తర్వాత మొట్టమొదటి విజయాన్ని అందించిన పటాన్ చిత్రంలో షారుక్ సరసన దీపికా పదుకొనే( Deepika Padukone ) అందాల ప్రదర్శనతో పాటు ఏజెంట్ గా కూడా మెరిపించింది.ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కుతుండగా ఈసారి కూడా వీళ్ళిద్దరి మధ్య మంచి హాట్ హాట్ సన్నివేశాలు అలాగే యాక్షన్స్ సన్నివేశాలు ఉండబోతున్నాయట.

ఇలా చాలామంది హీరోయిన్స్ హీరోలకు దీటుగా ఏజెంట్ పాత్రల్లో నటించడం నిజంగా మంచి విషయమే కానీ కేవలం తెలుగు నుంచి సమంత మినహా మరే హీరోయిన్ కూడా ఇలాంటి సాహసం చేయాలనుకునే లిస్టులో లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube