నిధి అగర్వాల్.తన లేలేత అందాలతో కుర్రకారును కైపెక్కించే నటి.
తాజాగా ఆమె నటించిన హీరో సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.ఇందులో కుర్ర హీరోతో కలిసి ఆమె చేసిన రొమాన్స్ కుర్రకారులో సెగలు పుట్టించింది.
అంతేకాదు.తొలిసారి కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ సైతం అందుకుంది ఈ అమ్మడు.
ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.వాస్తవానికి ఈమె టాలీవుడ్ లో అడుగు పెట్టడానికి ముందే బాలీవుడ్ లో అలరించింది.
మున్నా మైఖేల్ అనే సినిమాతో అక్కడి జనాలకు పరిచయం అయ్యింది.అయితే ఈ సినిమా అంతగా ఆడలేదు.
ఆ తర్వాత సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సత్తా చాటింది.పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన తాజా మూవీ ఇస్మార్ట్ శంకర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాతో కలిసి హీరో సినిమాలో ఆడి పాడింది.తన సూపర్ గ్లామర్ తో ఆకట్టుకుంది.
తాజాగా ఈ అమ్మడు తన తొలి సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.మున్నా మైఖేల్ సినిమాలో నటించే సందర్భంలో ఓ అగ్రిమెంట్ చేసుకుంది.
హీరో టైగర్ తో గానీ, మరే ఇతర సిబ్బందితో గానీ డేటింగ్ చేయకూడదనే నిబంధన ఉందట.దానికి తను ఓకే చెప్పి కాంట్రాక్ట్ మీద సైన్ చేసిందట.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఈ విషయాన్ని వెల్లడించింది.

వాస్తవానికి ఇలాంటి నిబంధనలు తానెక్కడా చూడలేదని చెప్పింది.అయితే తొలి సినిమా కావడంతో తనకు పెద్దగా ఈ విషయాల గురించి తెలియదని చెప్పింది.సినిమాలో అవకాశం వచ్చినందకు ఉన్న సంతోషంతో పోల్చితే.
ఈ నిబంధన తనకు అస్సలు ఇబ్బంది అనిపించలేదని వెల్లడించింది.నాకు అప్పట్లో సినిమా చేయడం అనే ఆలోచన తప్ప మరే ఆలోచన లేదని వెల్లడించింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ స్టార్ శింబుతో సహజీవనం చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది.తాజాగా ఈమె పవన్ కల్యాన్ మూవీ హరిహర వీరమల్లులో నటిస్తుంది.