నేడు అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.అదేవిధంగా మహా పాదయాత్రలో పోలీసుల ఆంక్షలపై మరో పిటిషన్ వేయనున్నారు రైతులు.
సంఘీభావం తెలిపే వారు యాత్రలో పాల్గొనవద్దని, పాదయాత్రలో కేవలం 600 మంది మాత్రమే పాల్గొనలాని ఇటీవల హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో 600 మందిని మాత్రమే పోలీసులు పాదయాత్రకు అనుమతిస్తున్నారు.
ఐడీ కార్డులు చూపించి ముందుకు సాగాలని చెబుతున్నారు.దీంతో పోలీసులు తమ పాదయాత్రను అడ్డుకుంటున్నారని, ఇంకా ఆంక్షలు విధిస్తున్నారంటూ అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే హైకోర్టులో నేడు మరో పిటిషన్ దాఖలు చేయనున్నారు.