పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.అంతర్వేది సరిహద్దు తీరంలో బోటు బోల్తా పడింది.
చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ప్రమాదవశాత్తు బోల్తా పడినట్లు తెలుస్తోంది.ఈ ప్రమాదంలో ముగ్గురు నీటిలో పడిపోగా.
ఇద్దరు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.మరో వ్యక్తి గల్లంతు అయ్యారు.
గల్లంతైన వ్యక్తి బియ్యప్పితిప్పకు చెందిన నాగరాజుగా గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన మత్య్సకారుని కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.







