డేరా సచ్చా సౌదా నేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా మరోసారి వార్తలోకెక్కారు.అత్యాచార ఘటనలో జైలు పాలైన డేరా బాబా ఇటీవలే పెరోల్ పై బయటకు వచ్చారు.
ఈ నేపథ్యంలోనే తన సన్నిహితురాలు హనీ ప్రీత్ ఇన్సాన్ కు కొత్త పేరు పెట్టినట్లు ప్రకటించారు.ఇకపై ఆమె రుహానీ దీదీగా ప్రసిద్ధికెక్కుతుందని సెలవిచ్చారు.
ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా రుహానీ దీదీ అని పేరు పెట్టామన్న డేరా బాబా.రుహీ దా అని కూడా పిలుచుకోవచ్చని స్పష్టం చేశారు.
అయితే, ఆమెను ఇప్పటికే దత్తపుత్రికగా డేరా బాబా ప్రకటించిన విషయం తెలిసిందే.







