తట్టుకోలేక చివరికి ఇంట్లోనే అది తయారు చేసిన హీరోయిన్...

తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన నటి హంసానందిని గురించి తెలియని వారుండరు.అయితే ఈమె ఇప్పటి వరకు దాదాపుగా 20 కిపైగా చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.

 Hamsa Nandini, Telugu Heroine, Panipuri Making Video In Home, Tollywood-TeluguStop.com

చక్కని ముఖ కవళికలు, అందం, అభినయం ఉన్నప్పటికీ  కానీ కథల విషయంలో సరైన అవగాహన లేకపోవడంతో తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా హంసానందిని నిలదొక్కుకోలేక పోయింది.దీంతో అప్పుడప్పుడు ఈ అమ్మడు పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో స్పెషల్ గీతాల్లో నృత్యం చేస్తూ తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది.

ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో ఈ అమ్మడు ఇంటికే పరిమితమైంది.

ఇందులో భాగంగా పలు రకాల వంటల వీడియోలను చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.

అయితే తాజాగా హంసానందిని చిరుతిండి అయినటువంటి పానీ పూరినీ ఇంట్లోనే స్వతహాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తూ వీడియోని రూపొందించింది.అంతేగాక ఈ వీడియోని ఫేస్ బుక్ లో తన అభిమానులతో పంచుకుంది.

మొదటి సారి తాను పానీపూరి తయారుచేశానని చాలా బాగుందని కాబట్టి మీ ఇంట్లో కూడా పానీ పూరిని తయారు చేసుకోండి అంటూ పానీ పూరి తయారు చేయడానికి కావలసిన పదార్థాల లిస్ట్ ని కూడా తెలియజేసింది.గత కొద్దికాలంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా పానీ పూరి గప్ చుప్ షాపులను మూసివేయడంతో చాలామంది పానీపూరి ప్రియులు మరియు చిరుతిళ్ల ప్రియులు ఇబ్బందులు పడుతున్నారు.

కాబట్టి అలాంటి వాళ్లకి ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

గతంలో కూడా ఓ చిన్నారి ఏకంగా తనకు పానీపూరి కావాలి కేసీఆర్ తాత అంటూ ఓ వీడియో రూపొందించగా చిన్నారి తండ్రి ఏకంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

ఈ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది.ఏకంగా కేటీఆర్ కూడా స్పందించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube