మోకాళ్లపై కూర్చోబెట్టి నా కులం గురించి దారుణంగా దూషించారు.. హెయిర్ డ్రెస్సర్ ఆవేదన?

గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీ ఎక్కువగా సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.నిత్యం ఏదో ఒక వివాదంతో మంచు ఫ్యామిలీలో ఎవరో ఒకరు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

 Hair Dresser Naga Vishnu Allegations On Mohan Babu Manchu Vishnu Details, Mohan-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇటీవల మంచు విష్ణు ఆఫీస్ లో ఈ డ్రెస్ లో దొంగతనం చేశారు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.ఇదే విషయంపై మంచు ఫ్యామిలీ మరొకసారి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

హీరో మంచు విష్ణు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ దాదాపు ఐదు లక్షల వరకు దొంగతనం చేశాడు అంటూ వార్తలు పెద్దఎత్తున వినిపించాయి.ఇదే విషయంపై విష్ణు మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం కూడా తెలిసిందే.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీను పంపిన ఒక సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో తాను ఇటువంటి దొంగతనం చేయలేదని, అంతే కాకుండా మంచు ఫ్యామిలీ తనపై లేదు నిందలు వేస్తోందని తెలిపాడు.

అంతే కాకుండా మంచు విష్ణు, మోహన్ బాబు కలసి తన చిత్రహింసలు పెట్టి చెప్పుకోలేని విధంగా బూతులు తిట్టడమే కాకుండా, కులం పేరుతో అవమానిస్తూ మాట్లాడడంతో తాను ఉద్యోగం మానేసానని, అందుకే తనపై ఐదు లక్షలు విలువైన హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి చోరీ అంటూ అక్రమంగా కేసులు పెట్టారని అతడు వాపోయారు.

అంతేకాకుండా మోహన్ బాబు అతన్ని తిట్టడం, కూర్చోబెట్టి కొట్టడం ఇలాంటివి అన్ని కూడా అక్కడ ఉన్న సీసీటీవీ లో రికార్డ్ అయ్యిందని, ఇదంతా కూడా ఫిబ్రవరి 17న మధ్యాహ్నం 1:00 సమయంలో జరిగింది అని అతడు చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా తనపై లేనిపోని కేసులు పెట్టడంతో ఆ విషయం తెలుసుకున్న అతని తల్లి గుండెనొప్పితో హాస్పిటల్ లో జాయిన్ అయ్యింది అని, మోహన్ బాబు వద్ద తాను పదేళ్లుగా నమ్మకంగా పని చేస్తున్నానని అలాంటి నా పై ఇలాంటి నిందలు వేయడం మీకు భావ్యం కాదు అతడు తెలిపారు.

విష్ణు బాబు నాపై అనవసరంగా కేసు పెట్టించారు.వారు అన్న బూతులు నేను మీకు చెప్పలేను.ఆ మాటలు పడలేకే నేను ఉద్యోగం మానేశాను.

అతని లాంటి చిన్నవారి జీవితాలతో ఆడుకోవడం మంచు ఫ్యామిలి లాంటి పెద్దవాళ్లకు తగదని దయచేసి నన్ను వదిలేయండి సదరు వ్యక్తి పోస్య్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లీ వైరల్ గా మారింది.మరి ఈ వీడియోపై మంచు ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

Hair Dresser Naga Vishnu Allegations On Mohan Babu Manchu Vishnu Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube