రాజ్భవన్లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈవేడుకల్లో గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ పాల్గొని ప్రసంగించారు.
ఈ క్రమంలోనే మహిళలకు పలు సూచనలు ఇచ్చారు.మహిళలు అత్యున్నత పదవిలో ఉన్నా వివక్షకు గురవుతున్నారని, ఇందుకు తానే ఉదాహరణ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మహిళలకు నేటికీ గౌరవం దక్కడం లేదని అన్నారు.అయితే తనను మాత్రం ఎవరూ భయపెట్టలేదని, నేనూ దేనికీ భయపడని చెప్పుకొచ్చారు.
తాను సమాన హక్కుల కోసం డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం భాదిస్తోందని అన్నారు.ఏ మహిళ కూడా తన స్వార్థం కోసం ఏదీ కోరుకోదని, ప్రతిదీ కుటుంబం కోసమే ఆలోచిస్తుందని ప్రసంగించారు.
అయితే మహిళ లందరూ ఆర్థిక స్వాలంభన కలిగి ఉండాలని, నిరాశ, నిస్పృహలకు పోకుండా ప్రతి అడుగు నూతనోత్సాహంతో ముందుకు వేయాలని, ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.
అయితే ఇటీవల కొందరు తనను తమిళనాడు మహిళలు, తెలంగాణ మహిళలకు తేడా ఏంటంటూ తనను అడిగారని చెప్పుకొచ్చారు.
మహిళలంతా ఒకేలా ఉంటారని, ప్రాంతాలను బట్టి మనుషులు మారారని, తెలంగాణ సోదరిగా ఇక్కడి మహిళల జీవన విధానాన్ని ఎంతగానో ఇష్టపడతానని వెల్లడించారు.అయితే మహిళలు మాత్రం సాధించాలన్న తపనతో ఉండాలని, అవకాశాలు చేజారి పోయినా బాధపడొద్దని, మనో ధైర్యంగా ముందుకు సాగాలని హితవు పలికారు.
మహిళలను గుర్తించి గౌరవించి వారి అద్భుత విజయాలను జరుపు కునేందుకు మహిళా దినోత్సవం కావాలని గవర్నర్ చెప్పుకొచ్చారు.
మరో వైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభించిన విషయం విధితమే.కాగా గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ మహిళ కావడంతోనే వివక్ష చూపారని విమర్శించడం ఆసక్తి కరంగా మారింది.ప్రభుత్వం మాత్రం గత సమావేశాలకు కొనసాగింపుగానే జరుపు తున్నామని, దీనికి ప్రత్యేకంగా గవర్నర్ ప్రసంగం అవసరం లేదంటూ చెప్పు కొచ్చారు.
కాగా మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా తన పట్ల వివక్ష చూపారని గవర్నర్ వ్యాఖ్యానించడం చర్చకు దారితీస్తోంది.