ఏపీ సీఎస్ గా కె.విజయానంద్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం విజయానంద్ విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు.అస్వస్థతకు గురైన ప్రస్తుత చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ గుండె సంబంధిత సమస్యల కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో విజయానంద్ కు బాధ్యతుల అప్పగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.సమీర్ శర్మ డిశ్చార్జ్ అయి మరలా విధుల్లో చేరేంత వరకు విజయానంద్ తాత్కాలిక సీఎస్ గా విధులు నిర్వహించనున్నారు.