బాలయ్య టాక్ షోలో మూడవ గెస్ట్ గా సందడి చేయనున్న నటి రమ్యకృష్ణ.. ఇందులో నిజమెంత?

నందమూరి నటసింహం బాలకృష్ణ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతున్నారు.ఇప్పటికే మొదటి సీజన్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోగా రెండవ సీజన్ కూడా అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకుంది.

 Actress Ramyakrishna Who Will Make Noise As The Third Guest In Balayya Talk Show-TeluguStop.com

రెండవ సీజన్ లో భాగంగా ఇప్పటికే మొదటి ఎపిసోడ్ పూర్తి అయింది.మొదటి ఎపిసోడ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇక రెండవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో రెండవ ఎపిసోడ్ లో సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ పాల్గొనబోతున్నారు.

ఇప్పటికే రెండవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో బాలకృష్ణ యంగ్ హీరోలతో కలిసి ఎంతో సరదాగా ముచ్చటించినట్టు తెలుస్తుంది.ఇకపోతే ఈ కార్యక్రమానికి మూడవ గెస్ట్ గా అందాల నటి సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణతో పాటు యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది.

Telugu Balakrishna, Balayya Show, Chandrababu, Krishna Vamsi, Rashi Khanna, Vish

ఇలా మూడవ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ ఈ శుక్రవారం జరగనుందని సమాచారం.ఇక రమ్యకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో బాలయ్య తనని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది.గతంలో రమ్యకృష్ణ తన భర్త కృష్ణ వంశీ మధ్య మనస్పర్ధలు వచ్చాయని వీరిద్దరూ విడాకులు కూడా తీసుకోవాలనుకున్నారంటూ వార్తలు వచ్చాయి.మరి ఆ విషయం గురించి బాలకృష్ణ ఇక్కడ ప్రస్తావిస్తారా? ఈ ప్రశ్నలకు రమ్యకృష్ణ ఎలాంటి సమాధానం చెబుతారు అనే విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube