మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలువురు నేతలు బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నారు.
తాజాగా ఆ బాటలో రాపోలు కూడా నడవనున్నట్లు సమాచారం.ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో రాపోలు సమావేశం అయ్యారు.
చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను, సంక్షేమ పథకాలను ఆయన కొనియాడారు.అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని ఆయన విమర్శించారు.
ఈ క్రమంలోనే ఆయన గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.