పూర్తి కాలం కాదు తాత్కాలికమే: ఈ-సిగరెట్ల నిషేధంపై మాట తప్పిన ట్రంప్

యువతపై దుష్పరిణామాలతో పాటు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఫ్లేవర్డ్ ఈ-సిగరెట్లపై త్వరలో నిషేధం విధించనున్నట్లు అమెరికా ప్రభుత్వం గురువారం ప్రకటించింది.పొగాకు లేదా మెంతోల్ కాకుండా కాట్రిడ్జ్ (గుళిక) ఆధారిత ఈ సిగరెట్ల తయారీకి ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోతే అమ్మకం/కొనుగోలు చట్టవిరుద్ధమని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఒక ప్రకటనలో తెలిపింది.30 రోజుల్లోపు ఇటువంటి గుళికల తయారీ, అమ్మకాలను నిలిపివేయని సంస్థలకు శిక్ష తప్పదని ఎఫ్‌డీఏ తెలిపింది.

 Ernment Imposes Partial Flavored E Cigarettes-TeluguStop.com

యువత ఈ-సిగరెట్ల వాడకం ప్రస్తుతం దేశంలో అంటువ్యాధిలా తయారైందని యూఎస్ ఆరోగ్య కార్యదర్శి అలెక్స్ అజార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం దేశంలో ఈ సంక్షోభం మరింత పెరుగుతుండటంతో తాము రంగంలోకి దిగక తప్పలేదని.ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అజార్ వెల్లడించారు.2019 నేషనల్ యూత్ టుబాకో సర్వే ప్రకారం అమెరికాలో ఐదు మిలియన్లకు పైగా మిడిల్, హైస్కూల్ విద్యార్ధులు ఈ-సిగరెట్లను వినియోగిస్తున్నారని తేలింది.అలాగే ప్రతిరోజు దాదాపు ఒక మిలియన్ మంది ఈ-సిగరెట్లను ఉపయోగిస్తున్నారని సర్వే పేర్కొంది.

Telugu Telugu Nri Ups, Imposesban-

పొగాకు, మెంతోల్ రుచిగల ఈ-సిగరెట్ల కంటే పండ్లు, పుదీనా వంటి ఈ-సిగరెట్ రుచుల పట్ల ఆకర్షితులవుతున్నారని మరో ఫెడరల్ సర్వేలో తేలింది.కాగా ఈ-సిగరెట్లను పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతేడాది సెప్టెంబర్‌లో ఇచ్చిన హామీకి తాజా ప్రకటన పూర్తి విరుద్ధంగా ఉండటంతో పలువురు విమర్శిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube