చిరంజీవి ప్రస్తుతానికి రాజకీయాలకి దూరంగా ఉన్నా అప్పుడప్పుడు రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా ఉండలేక పోతున్నారు.గత ఎన్నికల్లో చిరు పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇస్తారని, ఏదో ఒక ప్రాంతం నుంచీ పోటీ చేస్తారని అనుకున్నారు అందరూ కానీ అది ఎక్కడా జరగలేదు.
సొంత తమ్ముడు ఒక పార్టీ పెట్టి అందులోనూ ప్రజా రాజ్యంలో కీలక పాత్ర పోషించిన తమ్ముడి కోసం ప్రచారమైనా చేస్తారనుకుంటే అది కూడా జరగలేదు.దాంతో చిరుకి పవన్ కి మధ్య ఇంకా గ్యాప్ పూడలేదని ఫిక్స్ అయ్యారు…కానీ
మధ్య మధ్యలో ఇద్దరి మధ్య ఎలాంటి వివాదాలు లేవన్నట్టుగా కలరింగ్ ఇస్తూ ఫోటోలు దిగడంవంటివి చేసినా ఇద్దరి మధ్య ఎదో గొడవలు ఉన్నాయని ఇండస్ట్రీ లో టాక్ ఉండేది.
ఇదిలాఉంటే జగన్ మోహన్ రెడ్డి పాలనపై తాజాగా రాజధాని విషయంలో ప్రభుత్వ నిర్ణయాలపై నిరసన తెలిపిన పవన్ కళ్యాణ్ కి తన అన్న చిరంజీవి షాకుల మీద షాకులు ఇస్తున్నారు.ప్రభుత్వ 100 రోజుల పాలన తరువాతే ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ కొన్ని ఆతరువాత కొన్ని విమర్శలు జగన్ పాలనపై సంధించిన సమయంలోనే చిరు జగన్ ని కలిసి జగన్ కి విషెస్ చెప్పడం, మీ పాలన బాగుందని చెప్పడంతో షాక్ అయ్యారు జనసేన అండ్ కో.
మళ్ళీ ఇదే సీన్ నిన్నటి మా డైరీ ఆవిష్కరణ వేదికపై రిపీట్ అయ్యింది.తాజాగా జగన్ పై చిరు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు భీమిలిలో 360 ఎకరాలు సినిమా ఇండస్ట్రీ కి కేటాయిస్తామని అన్నారని, అది మనం ఉపయోగించుకోలేక పోయామని అన్నారు వెంటనే పరుచూరి నుంచీ మైక్ అందుకున్న చిరు.