Bandla Ganesh : నాలుగు నెలలు ఓపిక పట్టండి.. తెలంగాణలో వచ్చేది ఆ ప్రభుత్వమే.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్!

గత కొద్దిరోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే.దీంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి.

 Bandla Ganesh On Heavy Rains And Hyderabad Traffic Jam-TeluguStop.com

అంతేకాకుండా ఈ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో హైదరాబాద్ మొత్తం అంతా కూడా ఈ డబ్బులు ఇచ్చింది.లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు వచ్చి చేరాయి.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించేసింది.చాలా ప్రదేశాలలో వాహన రాకపోకలు కూడా నిలిచిపోయాయి.

ఈ వరద నీరు కారణంగా హైదరాబాద్ నగరంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.

అయితే ఈ పరిస్థితి పై తాజాగా సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ ( Bandla ganesh )స్పందించారు.ఈ సందర్భంగా ఈ పరిస్థితులపై బండ్ల గణేష్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసాడు.ఇది మన హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ అంటూ ఐకియా ఏరియాలోని విజువల్స్ చూపించాడు.

నాలుగు నెలల తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంట్( Congress party ) లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తాం.అలాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం.దయచేసి నాలుగు నెలలు భరించండి అంటూ బండ్ల గణేష్ ట్వీట్ వేశాడు.అయితే ఈ పోస్ట్ పై తెలంగాణ ప్రజలు నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

చూసాంలే నాయనా వెళ్లు.

ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వాళ్లు చేసింది చాలులే ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు చేసి ఉంటే నువ్వు ఇలా ట్వీట్ చేసేవాడిని కాదు అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.ఇంతలోనే మరొకటి నెటిజెన్ మీరు 15 నుంచి 20 సంవత్సరాల ముందు చేసిన కామెడీ గుర్తుకు వస్తోంది అంటూ కామెంట్ చేశాడు.ఇంతలోనే మరొక నెటిజన్ శుభ్రంగా వెళ్లి ఏదో సినిమాలు చేసుకోకుండా నీకెందుకు నాయనా ఈ రాజకీయాలు అంటూ వ్యంగంగా కామెంట్ చేశాడు.

కొందరు బండ్లగణేష్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు విమర్శలు గుప్పిస్తూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube