అంగారక గ్రహంపై జీవం ఉందా.. సేంద్రీయ అణువులను గుర్తించిన నాసా రోవర్!

భూమి పక్కనే ఉన్న అంగారక గ్రహాన్ని అన్వేషించడానికి నాసా పర్సెవరెన్స్‌ అనే రోబోను పంపిన సంగతి తెలిసిందే.అంగారకుడిపై ఎప్పుడైనా జీవం అనేది ఉందా లేదా అని చూడటం దీని పని.

 Is There Life On Mars.. Nasa Rover Detected Organic Molecules , Perseverance, M-TeluguStop.com

దాదాపు మూడు సంవత్సరాల పాటు అన్వేషించిన తర్వాత, పర్సెవరెన్స్‌ ( Perseverance ) రోవర్ జెజెరో క్రేటర్ ( Jezero Crater ) అనే ప్రదేశంలో ఓ అద్భుతమైన విషయాన్ని కనుగొంది.జెజెరో క్రేటర్( Jezero Crater ) వివిధ రకాల ఖనిజాలతో మార్స్ మీద ఒక పెద్ద సరస్సుగా ఉండేదని పర్సెవరెన్స్‌ కనిపెట్టింది.

అక్కడే “ఆర్గానిక్ మాలిక్యూల్స్” దొరకబుచ్చుకుంది.ఈ అణువులు జీవులకు బిల్డింగ్ బ్లాక్స్‌లా పనిచేస్తాయి.భూమిపై మొక్కలు, జంతువుల వృద్ధికి ఉపయోగపడే అణువులు వలె ఇవి పనిచేస్తాయి.ఈ ఆర్గానిక్ అణువుల వల్ల అంగారక గ్రహంపై గతంలో జీవం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

కానీ వారు అప్పుడే ఒక నిర్ధారణకు రాకూడదు.ఎందుకంటే కొన్నిసార్లు ఈ అణువులు జీవుల ద్వారా మాత్రమే కాకుండా ఇతర మార్గాల్లో కూడా తయారు అవుతాయి.

పర్సెవరెన్స్‌ రోవర్ ఈ అణువులను లేజర్‌తో కూడిన సూపర్ కెమెరా లాంటి షెర్లాక్ ( SHERLOC ) అనే ప్రత్యేక టూల్ ఉపయోగించి కనుగొంది.ఖనిజాలు, సేంద్రీయ అణువులు నిజంగా పురాతన జీవుల నుంచి వచ్చాయా లేదా అని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఇది సహాయపడుతుంది.

మొత్తం మీద ఈ ఆవిష్కరణ అందరిలో ఉత్సాహం నింపుతోంది.ఎందుకంటే ఇది అంగారక గ్రహం చాలా కాలం క్రితం ఎలా ఉండేదో మనకు మరింత తెలియజేస్తుంది.

బహుశా అక్కడ జీవం ఉందేమో అనే అనుమానాలను నిజం చేస్తోంది.కానీ మనం ఇంకా తెలుసుకోవలసిన విషయాలు చాలానే ఉన్నాయి.సమాధానం కనుగొనాల్సిన చాలా ప్రశ్నలూ ఉన్నాయి.అవి తెలిసేంతవరకు శాస్త్రవేత్తలు మరిన్ని ఆధారాలను కనుగొనడానికి, మార్స్, మొత్తం విశ్వం గురించి తెలుసుకోవడానికి అన్వేషిస్తూనే ఉంటారు!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube