ఫెడరల్ ఫ్రంట్ పెడతా అన్న కే‌సి‌ఆర్ ఎందుకు మాట మార్చాడు

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టలపై సియల్పి నేత బట్టి విక్రమార్క ఆరోపణలు చేశాడు.ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ నూతన వ్యవసాయ చట్టలకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో పాల్గొని ఆ ఆ తర్వాత నరేంద్ర మోడీ పిలుపు మేరకు డిల్లీ కి వెళ్ళి వచ్చిన తర్వాత కేంద్ర నూతన వ్యవసాయ చట్టలపై సైలెంట్ గా ఉండటంపై కే‌సి‌ఆర్ లో మార్పు వచ్చిందని పై నుండి ముడుపులు అందాయని అందుకే కే‌సి‌ఆర్ కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లుకు మద్దతు తెలిపాడని బట్టి అన్నాడు.

 Batti Vikramarka Comments On Kcr For Support The Bjp Party , Batti Vikramarka, K-TeluguStop.com

తక్షణమే అసెంబ్లీ సమావేశాలు జరిపి కేంద్ర చట్టలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కోరాడు, లేకపోతే మేమే ప్రైవేట్ బిల్లును ప్రవేశ పెడతాం అన్నాడు.కేంద్రంకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ కడుతా అన్న కే‌సి‌ఆర్ ఇప్పుడు ఆ ఫెడరల్ ఫ్రంట్ ఎటు పోయిందని ప్రశ్నించాడు.

బి‌జే‌పి పార్టీ వ్యాపారస్తుల పార్టీ అని వ్యవసాయాన్ని వ్యాపారస్తుల చేతిలో పెట్టడానికి చూస్తుందని అన్నాడు.కేంద్ర, రాష్ట్రాల మధ్య ఫెడరల్ స్పూర్తి లేకుండా బి‌జే‌పి చేస్తుందని బట్టి ఆరోపించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube