ఐపీఎల్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ గాజువాక, తిరుమల నగర్ లో ఎనిమిది మంది కుర్రాళ్ళు డూప్లెక్స్ హౌస్ అద్దెకు తీసుకుని ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నారన్న సమాచారం తెలుసుకొని దువ్వాడ సిఐ లక్ష్మీ తన సిబ్బందితో ఆకస్మిక దాడి చేయగా వారికి పట్టుబడ్డ ఎనిమిది మంది కుర్రాళ్ళు, రెండు ల్యాప్ టాప్ , 20 మొబైల్ మరియు 22 సిం కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడ్డ ఎనిమిది మంది యువకులు చత్తీష్ ఘర్ రాష్ట్రం బిలాయ్ కి చెందిన వారు.
స్ధానికంగా వున్న ప్రదీప్ అనే యువకుడు ఇక్కడకు తీసుకువచ్చాడని సిఐ తెలిపారు.ఇది ఢిల్లీ లెవెల్ లో జరుగుతున్న ఆన్లైన్ బెట్టింగ్.
వీళ్లపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది.