పెరుగు.ప్రతిరోజు మనం విరివిరిగా ఉపయోగించే ఆహారపదార్థాల్లో ఇది కూడా ఒకటి.రుచిలోనే కాదు.మంచి ఆరోగ్యాన్ని అందించడంలోనూ పెరుగుకు సాటిలేరెవ్వరు.పెరుగులోని ప్రొటీన్స్ శరీరానికి కావాల్సిన పోషక విలువలను అందిస్తాయి.రోజుకో కప్పు పెరుగు తింటే.
బీపీ కంట్రోల్లో ఉండడం, ఎముకలు బలంగా మారడం, గుండె ఆరోగ్యం మెరుగుపడడం, శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
అయితే పెరుగు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.
చర్మాన్ని మెరిపించడంలోనూ అద్భుతంగా ఉపయోగపడుతుంది.మరి పెరుగును చర్మానికి సరైన పద్ధతిలో ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందులో ముందుగా.పెరుగు, తేనె మరియు నిమ్మరసం తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా అప్లై చేసి.అర గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడతాయి.అదే సమయంలో కొత్త కాంతిని సంతరించుకుంటుంది.అలాగే పెరుగు, పసుపు మరియు శెనగపిండి తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా అప్లై చేసి.అర గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల.
ముఖంపై ఉన్న మృతకణాలు తొలగి ప్రకాశవంతంగా మారుతుంది.
మరియు జిడ్డు చర్మం నుంచి ఉపశమనం పొందాలన్నా ఈ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది.
అదేవిధంగా, పెరుగు మరియు ఎగ్వైట్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా అప్లై చేసి.
అర గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల ముఖం మృదువుగా తయారవుతుంది.
మరియు ముడతలు తగ్గి యవ్వనంగా మారుతుంది.