ట్రంప్ మామూలోడు కాదుగా...2016 రిపీట్ అవ్వుద్దా..??

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్ఖంట నెలకొంది.బహుశా ఈ స్థాయిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు గతంలో జరిగిఉండవు కాబోలు.

 Donald Trump Start The Election Campaign , Trump, America, Republic Party, Democ-TeluguStop.com

నవంబర్ 3 వ తేదీన జరగబోతున్న ఈ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టుగా డెమోక్రటిక్ , రిపబ్లికన్ పార్టీల మధ్య పోరు తారా స్థాయికి చేరుకుంది.ఇదిలాఉంటే 2016 న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, హిల్లరీ ల మధ్య జరిగిన పోరులో హిల్లరీ విజయం సాధిస్తుందని అందరూ భావించారు, సర్వేలు సైతం ట్రంప్ ఓటమి ఖాయమనే చెప్పాయి.

కానీ అనూహ్యంగా పరిశీలకుల అంచనాలు సైతం పక్కన పెడుతూ ట్రంప్ ఘన విజయం సాధించారు…అయితే

ప్రస్తుతం ఎన్నికల్లో సైతం ట్రంప్ విజయానికి ఆమడ దూరంలో ఉన్నారని, ట్రంప్ గెలుపు అసాధ్యమని సర్వేలు, నిపుణులు కూడా అంచనాలు వేస్తున్నారు.కానీ ట్రంప్ దూకుడు చూస్తుంటే ఈ సారి కూడా విజయం తనదేనని ఫిక్స్ అయిపోయారు, అందుకు తగ్గట్టుగా వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.

తాజాగా జరిగిన రిపబ్లికన్ కన్వేషణ్ కి కుటుంభంతో కలిసి హాజరైన ట్రంప్ తనదైన శైలిలో ప్రసంగం చేశారు.వచ్చే నాలుగేళ్లలో తాను ఏమి చేస్తాను, చేపట్టే సంస్కరణలు వగైరా, వగైరా ప్రకటించారు.మళ్ళీ అధ్యక్షుడిగా గెలిపించాలని, తానె అధ్యక్షుడుని అవుతానని ఘంటాపథంగా చెప్తున్నారు.

2016 ఎన్నికల ప్రచారంలో చేసిన నినాదలనే మళ్ళీ పలుకుతున్న ట్రంప్, అమెరికా అమెరికన్స్ కి మాత్రమే అంటూ హోరెత్తిస్తున్నారు.శక్తివంతంగా , ఎంతో సురక్షితమైన అమెరికాను తానూ భవిష్యత్తులో నిర్మిస్తానని హామీ ఇచ్చారు.అంతేకాదు అమెరికా ఓటర్లని ఆకట్టుకునేలా చైనా విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.చైనాని ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించనని, తగిన బుద్ధి చెప్తానని అన్న ట్రంప్, తాను విజయం సాధించాకపొతే చైనా చేతుల్లోకి అమెరికా వెళ్ళిపోతుందని ఇక మీరే నిర్ణయం తీసుకోవాలని తన ప్రసంగంతో ఓటర్లని ఆకట్టుకున్నారు. ట్రంప్ గత ఎన్నికల్లో అవలభించిన తీరునే ప్రస్తుతం కూడా పాటిస్తున్నారని, ప్రస్తుతం గెలుపు విషయంలో ఏ ఒక్కరికి దక్కుతుందనే విషయం స్పష్టంగా చెప్పలేమని, 2016 సీన్ రిపీట్ అయినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదని, చివరిలో ఎలాంటి మార్పులు అయినా జరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube