శ్రీదేవి నిర్మాతగా చిరంజీవితో సినిమా చేయాలనుకుంది.. కానీ ఏమైందో తెలుసా?

నేటి రోజుల్లో కేవలం పురుషులు మాత్రమే కాదు మహిళలు కూడా అటు నటనలో మాత్రమే కాకుండా దర్శకులుగా నిర్మాతలుగా రాణిస్తున్నారు.ఇటీవలి కాలంలో నిర్మాతలుగా కొనసాగుతున్న సినీ సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు అని చెప్పాలి.

 Do You Know About Chiranjeevi Movie With Sridevi As Producer Details, Chiranjeev-TeluguStop.com

కాగా ఇప్పుడు మాత్రమే కాదు నిన్నటి తరంలో మొన్నటి తరంలో కూడా ఎంతో మంది మహిళలు నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన వారు ఉన్నారు.కొంతమంది పేరు ఇప్పటికీ కూడా ప్రేక్షకులకు తెలియదు అని చెప్పాలి.ఇలా నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది హీరోయిన్లలో శ్రీదేవి కూడా ఒకరు అని చెప్పాలి.

1990వ దశకంలో శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో అందరూ పడి చచ్చిపోయే వారు.వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చి సూపర్హిట్ సాధిస్తూ ఉండేది.ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందన్న విషయం తెలిసిందే.

ఈ సినిమా తర్వాత అటు బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టి అక్కడ కూడా తన హవా నడిపించింది శ్రీదేవి. సరిగ్గా ఈ సినిమా విడుదలయ్యే సమయంలోనే భారీ వర్షాలు కారణంగా వరదలు వచ్చాయి.

కానీ ఈ వరదలు సినిమా విజయాన్ని మాత్రం ఎక్కడా ఆపలేకపోయాయి అని చెప్పాలి.ఆ తర్వాత శ్రీదేవి ఏకంగా నిర్మాతగా మారి చిరంజీవి తో ఒక సినిమా చేయాలని అనుకుంది.

Telugu Chiranjeevi, Jagadekaveerudu, Sridevi, Vajrala Donga-Movie

ఈ విషయం చాలామందికి తెలియదు.చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వజ్రాల దొంగ అనే సినిమా శ్రీదేవి నిర్మించాలని అనుకున్నారు.సొంత చెల్లెలు అయిన లతా పేరుపై.లతా ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించారూ.స్టార్ డైరెక్టర్గా సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా బప్పి లహరి ని కూడా ఎంచుకుంది.ఒక సెట్ వేసి సాంగ్ కూడా చిత్రీకరించారు.

కానీ ఈ సినిమా కథ విషయంలో చిత్ర దర్శకుడు కోదండరామిరెడ్డికీ ఎక్కడో తేడా కొట్టేసి.శ్రీదేవికి సర్దిచెప్పి చివరికి సినిమాఆపేసాడు.

అయితే అప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో నుంచి పేరు నేపథ్యంలో ఇక ఎన్నో ఆఫర్లు వచ్చినా సినిమా కథ పై నమ్మకం లేక ముందుకు తీసుకెళ్లలేక పోయారు కోదండరామిరెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube