నిజ జీవితంలో సీఎం కావాలని ఆశపడే సినిమా హీరోల సంఖ్య ఎక్కువగానే ఉంది.సీనియర్ ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోవడంతో నిజ జీవితంలో సీఎం అయ్యారు.
మరి కొందరు హీరోలు తెలుగు రాష్ట్రాలకు సీఎం కావాలని తీవ్రంగా శ్రమిస్తున్నా ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడం లేదు.అయితే సినిమాలలో సీఎం పాత్రలలో మెప్పించిన సెలబ్రిటీల జాబితా ఎక్కువగానే ఉంది.
స్టార్ హీరో బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలలో సీఎంగా కనిపించి తన నటనతో మెప్పించారు.భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు సీఎం రోల్ లో నటించగా ఈ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
నోటా సినిమాలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ సీఎం రోల్ లో నటించగా తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు./br>
![Telugu Ajmal Amir, Balakrishna, Ministers, Kangana, Mahesh Babu, Mammootty, Rana Telugu Ajmal Amir, Balakrishna, Ministers, Kangana, Mahesh Babu, Mammootty, Rana](https://telugustop.com/wp-content/uploads/2022/06/RanaChief-Ministers-Mammootty.jpg )
ఎన్జీకే మూవీలో సూర్య సీఎం రోల్ లో నటించారు.వైఎస్సార్ బయోపిక్ గా తెరకెక్కిన యాత్ర సినిమాలో మమ్ముట్టి సీఎం పాత్రలో నటించి మెప్పించారు.తలైవి సినిమాలో కంగనా, లీడర్ సినిమాలో రానా, అమ్మరాజ్యంలో కడపబిడ్డలు సినిమాలో అజ్మల్ అమీర్ సీఎం రోల్స్ లో నటించి మెప్పించారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో శ్రీతేజ్, రంగస్థల నటుడు విజయ్ కుమార్ సీఎం రోల్స్ లో నటించారు./br>
![Telugu Ajmal Amir, Balakrishna, Ministers, Kangana, Mahesh Babu, Mammootty, Rana Telugu Ajmal Amir, Balakrishna, Ministers, Kangana, Mahesh Babu, Mammootty, Rana](https://telugustop.com/wp-content/uploads/2022/06/Vijay-Kumar-Ajmal-Amir-Rana.jpg )
తెలంగాణ దేవుడు సినిమాలో శ్రీకాంత్, అధినేత్ సినిమాలో జగపతి బాబు, ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ సీఎం రోల్ లో నటించారు.సీఎం పాత్రలు కొంతమంది హీరోలకు సక్సెస్ ఇస్తే మరి కొందరు హీరోలకు మాత్రం ఫెయిల్యూర్ లను ఇచ్చాయి.అయితే పొలిటికల్ సినిమాలకు క్రేజ్ ఉండటంతో సీఎం పాత్రల్లో హీరోలను చూపించే డైరెక్టర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.