Dasari Narayana Rao : మూవీ ఇండస్ట్రీలో వారసత్వమే స్టార్ హీరోలను చేస్తుంది.. మిగతా వారు అవ్వలేరు : దాసరి

సాధారణంగా ఏ రంగంలోనైనా వారసత్వం అనేది బాగా ఉపయోగపడుతుంది.కుటుంబ సభ్యులు ఒక రంగంలో ఉంటే ఆ రంగంలో తదుపరి తరం వాళ్లు అడుగు పెట్టడం సులభం అవుతుంది.

 Dasari About Star Heros In Industry-TeluguStop.com

సక్సెస్ సాధించడం కూడా ఇతరుల కంటే వీరికి ఈజీగా ఉంటుంది.ఉదాహరణకి రాజకీయాల్లో వారసత్వం( Hereditary Politics ) ఉన్నవారు త్వరగా సక్సెస్ అవుతారు.

వ్యాపారం విషయానికొచ్చిన కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక, అనుభవ ప్రయోజనాలను పొంది తదుపరి తరం వాళ్లు విజయం సాధించగలుగుతారు.అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా వారసత్వం కీ రోల్ పోషిస్తుందని చాలామంది నమ్ముతారు.

కానీ అది నిజం కాదు.సినిమాల్లో( Movies ) సక్సెస్ కావాలంటే హ్యాండ్సమ్ గా ఉండాలి.

చక్కగా నటించగలగాలి, ఫైట్లు, డాన్స్ చేయాలి.డైలాగు డెలివరీ బాగుండాలి.

మంచి సినిమాలను ఎంచుకునే తెలివి ఉండాలి.ఇంకా స్టార్ హీరోగా ఎదగాలంటే మరెన్నో స్కిల్స్ కావాలి.

వారసత్వం అనేది మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ పాస్ లాంటిది.స్టార్ హీరో కొడుకు అయితే సినిమాల్లో సూపర్ స్టార్ కావచ్చు అనేది ఒక తప్పుడు అభిప్రాయం అని చెప్పుకోవచ్చు.

Telugu Dasari Yana Rao, Hereditary, Status-Movie

కానీ ప్రముఖ డైరెక్టర్ దాసరి నారాయణరావు( Dasari Narayana Rao ) మాత్రం వారసత్వం వల్లే స్టార్ కిడ్స్ స్టార్ హీరోలుగా మారుతున్నారని ఒకానొక సమయంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు.స్టార్ కిడ్స్ ఫెయిల్యూర్, సక్సెస్ లు పట్టించుకోకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తారని దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు చెప్పుకొచ్చాడు.నిర్మాతలు ఈజీగా దొరకడం, ఇన్‌ఫ్లుయెన్స్‌తో సినిమాలు తీస్తూ ఉండటం వల్ల వారి ఫేసులు ఒకానొక సమయంలో ప్రేక్షకులకు అలవాటు అవుతాయని, అప్పటినుంచి వారిని ఆదరించడం మొదలు పెడతారని వివరించాడు.


Telugu Dasari Yana Rao, Hereditary, Status-Movie

ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న స్టార్ హీరోలలో చాలామంది ఇదే టైపు అని చెప్పుకొచ్చాడు.బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరో( Star Hero )గా ఎదగాలంటే కనీసం 10 సంవత్సరాలు పడుతుందని, ఉదాహరణకి మోహన్ బాబుకు ఐదేళ్లు పట్టిందని తెలిపాడు.తన కొడుకుని కూడా హీరోగా నిలబెట్టాలంటే తను నిలబెట్టగలనని, కానీ బ్యాక్ గ్రౌండ్ తో హీరో చేయడం ఇష్టం లేదని దాసరి నారాయణరావు తెలిపాడు.

ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కొంతమంది ఈ మాటలకు అంగీకరిస్తుంటే, మిగతావారు మాత్రం టాలెంట్ ఉంటేనే ఎవరైనా రాణించగలరు అని పేర్కొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube