హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూల్ ఘటనలో నిందితుల కస్టడీ పిటిషన్ రేపటికి వాయిదా పడింది.నిందితులను ఐదు రోజుల కస్టడీకి పోలీసులు కోరారు.
కాగా ఇప్పటికే కేసులో బెయిల్ మంజూరు చేయాలని స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి పిటిషన్ దాఖలు చేశారు.ఈ నేపథ్యంలో ఈ రెండు పిటిషన్లపై రేపు నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి.
నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం డీఏవీ స్కూల్ ను మూసివేసిన విషయం తెలిసిందే.