ఐరన్ లెగ్ శాస్త్రి కొడుకు ప్రసాద్ ఒక యూట్యూబ్ ఛానల్ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నాన్న చనిపోయిన విషయం తెలిసి మా అమ్మ కళ్లు తిరిగి పడిపోయిందని అన్నారు.
నాన్న చనిపోయిన సమయంలో నాకేం అర్థం కాలేదని మైండ్ బ్లాంక్ అయిందని ప్రసాద్ అన్నారు.నాన్న శవాన్ని రిక్షాలో తీసుకెళ్లామని ప్రసాద్ కామెంట్లు చేశారు.
నాన్న చనిపోయిన సమయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి నాగబాబు వచ్చారని ప్రసాద్ పేర్కొన్నారు.సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కూడా వచ్చారని ప్రసాద్ వెల్లడించారు.
నాన్న మరణం తర్వాత జీవితంలో ఎటు వెళ్లాలో తెలియదని ఆయన పేర్కొన్నారు.నాన్న అప్పులు మాత్రం చేయలేదని ప్రసాద్ అన్నారు.
రౌడీ అల్లుడు సినిమా గురించి చిరంజీవి గారు కొన్నిరోజుల క్రితం మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అయిందని ప్రసాద్ అన్నారు.

ఆ వీడియోలో నాన్నగారి పాత్ర గురించి చిరంజీవి గారు చెప్పారని అయితే నాన్నగారి పేరు కూడా చిరంజీవి గారికి గుర్తు ఉండి ఉంటే బాగుండేదని ప్రసాద్ కామెంట్లు చేశారు.ఆ సమయంలో చిరంజీవి గారికి పేరు తట్టలేదేమో అని ప్రసాద్ చెప్పుకొచ్చారు.కొన్ని సందర్భాల్లో మనమే నాలుగు పేర్లు అకస్మాత్తుగా చెప్పాలంటే చెప్పలేమని ప్రసాద్ కామెంట్లు చేశారు.
చిరంజీవి గారు డౌన్ టు ఎర్త్ ఉంటారని ఆయన తెలిపారు.తమ్ముడు, బద్రి సినిమాలలో చేసినందుకు నాన్నగారు గర్వంగా చెప్పుకున్నారని ప్రసాద్ అన్నారు.42 సంవత్సరాల వయస్సులో నాన్నగారు చనిపోయారని ప్రసాద్ వెల్లడించారు.నాన్న ఎవరేం అడిగినా ఇచ్చేవారని ప్రసాద్ పేర్కొన్నారు.
నాన్నగారు చాలామందిని నమ్మి మోసపోయారని ప్రసాద్ అన్నారు.ప్రసాద్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఐరన్ లెగ్ శాస్త్రి కొడుకు ప్రసాద్ పలు సినిమాల్లో నటించినా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు.







