విశాఖకు విహార నౌక మూడు సర్వీసులు ఖరారు జూన్‌ 8,15,22 తేదీలలో నగరానికి రాక ఎం.వి.ఎంప్రెస్‌ విహార నౌక

విశాఖ నగరవాసుల్ని ఎంతో కాలంగా ఊరిస్తున్న విహారనౌకల సదుపాయం కొద్దిరోజుల్లో అందుబాటులోకి రానుంది ఎంప్రెస్‌ అనే పేరుగల నౌక విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వెళ్లి తిరిగి మళ్లీ విశాఖకు వస్తుంది ఆ నౌకలో విహరించాలను కునేవారు ఎంచుకునే సర్వీసును బట్టి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది ఆ సర్వీసు నడపడానికి నౌకాశ్రయ అధికారులను జె.ఎం.

 Cruise Ship To Visakhapatnam Three Services Finalized Mv Empress Cruise Ship Arr-TeluguStop.com

భక్షి సంస్థ ప్రతి నిధులు సంప్రదించగా వారు ఆమోద ముద్ర వేశారు సుమారు 1500- 1800 మంది వరకు ఇందులో ప్రయాణించడానికి వీలుంది ప్రస్తుతం విశాఖ నుంచి చెన్నై వరకు విహరించ డానికి టిక్కెట్లు విక్రయిస్తున్నారు మొదటి సర్వీసు ఈరోజు ఉదయం ప్రయాణికులతో వచ్చింది అందులోని ప్రయాణికులు విశాఖలో సాయంత్రం వరకు విహరిస్తారు ఆ నౌక విశాఖ నుంచి రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరి తొమ్మిదో తేదీ మొత్తం సముద్రంలోనే ప్రయాణిస్తుంది 10వ తేదీ ఉదయం ఏడు గంటలకు పుదుచ్చేరి చేరుకుంటుంది పుదుచ్చేరి లో రాత్రి ఏడుగంటల వరకు పర్య టించవచ్చు ఆయా ఏర్పాట్లు కూడా సంస్థే చేస్తుంది పుదుచ్చేరిలో రాత్రి ఏడు గంటలకు బయలుదేరి మరుసటి రోజు (నాలుగో రోజుకు) చెన్నైకు చేరు కుంటుంది ఎంప్రెస్‌ విదేశీ విహార నౌక అయినప్పటికీ దీన్ని ప్రస్తుతం భారత దేశంలో మాత్రమే తిరిగేలా నిర్వాహ కులు అనుమతులు పొందారు దీంతో పాస్‌పోర్ట్‌ అవసరం లేదు కస్టమ్స్‌ తనిఖీలు ఉండవు నౌకలో అబ్బుర పరచే పలు వసతులున్నాయి.ఫుడ్‌కోర్టులు,రెస్టారెంట్లు అందు బాటులో ఉంటాయి ఈతకొలను, ఫిట్‌నెస్‌ కేంద్రం తదితర సౌకర్యా లున్నాయి ఉదయం వేళల్లో పలు కార్యక్రమాలను వీక్షించే సదుపాయం ఉంది.

కాసినోను చూడడానికి అను మతిస్తారు పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు నగదు చెల్లించి భుజించడానికి కూడా నౌకలో కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి మద్యం, స్పా సర్వీసులు కాసినోలో క్రీడలకు డబ్బులు చెల్లించాలి విశాఖ నౌకా శ్రయానికి గతంలో కూడా కొన్ని నౌకలు వచ్చినా ప్రస్తుతం వచ్చే నౌకకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయిని అంటున్నారు ఇంటీరియర్‌ స్టాండర్డ్‌ రూం,ఓషన్‌ వ్యూ స్టాండర్డ్‌ రూం,మినీ సూట్‌ రూం,సూట్‌ రూం పేరిట నాలుగు విభాగాలు నౌక లో ఉన్నాయి ఒక్కో విభాగానికి ఒక్కో ధరను నిర్ణయించారు అదే నౌక జూన్‌ 15న, 22వ తేదీన కూడా వస్తుంది విశాఖ నగరానికి వచ్చేనెల 8వ తేదీన అతిపెద్ద క్రూయిజ్‌ వస్తోంది నౌకా శ్రయం లోకి రావటానికి దానికి అను మతులు ఇచ్చాం ఇతరశాఖల అధి కారులకు కూడా సమాచారం తెలియ జేశాం భారత సాగరతీరాల్లో మాత్రమే తిరిగే విహార నౌక కావడంతో అందు లోని పర్యాటకులలో దాదాపు అందరూ భారతీయులే ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube