… విశాఖ సిటీ లో వేరువేరు ప్రాంతాల్లో ఏటీఎం సెంటర్ల వద్ద చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు.హర్యానాకు చెందిన సందీప్ తో సహా నలుగురు వ్యక్తుల ముఠా విశాఖలో గత కొంత కాలంగా బస చేసింది.
వీరికి తెలంగాణ ప్రాంతానికి చెందిన షేక్ ఇఫ్రాయిల్ జైల్లో పరిచయమయ్యారు.వీరంతా కలిసి నగరంలోని వేర్వేరు ఏటీఎం కేంద్రాల వద్ద ఖాతాదారుల దృష్టి మరల్చి బ్యాంకులో నుంచి డబ్బు డ్రా చేశారు ఆ రకంగా పది మంది వ్యక్తుల వద్ద అ దాదాపు నాలుగు లక్షల రూపాయలను ఇరవై రోజుల వ్యవధిలో కాజేశారు.
దీనిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు.చోరీలు అనంతరం తిరిగి హర్యానా వెళ్లి తాజాగా విశాఖ వచ్చింది ఈ సమాచారం తెలిసిన క్రైం బ్రాంచ్ పోలీసులు హర్యానా పాటు వారికి సహకరించిన తెలంగాణ వారిని అరెస్టు చేశారు.
వీరి వద్ద అ 125 ఏటీఎం కార్డులు.ఇరవై తొమ్మిది వేల నగదుతో పాటు ఒక కారు స్వైపింగ్ మిషన్ను సీజ్ చేసినట్టు క్రైమ్ ఏడిసిపి గంగాధరం తెలిపారు.