కేంద్రంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం రాకుండా చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది.దీనిలో భాగంగానే.
ఇప్పుడు అనేక వ్యూహాలకు ఆ పార్టీ తెరలేపింది.కేంద్రంలో నరేంద్రమోడీని రెండోసారి అధికారంలోకి రాకుండా చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేస్తోంది.2019 లోక్ సభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రాతినిధ్యం పెరిగేలా వీలైనన్నీ తక్కువ స్థానాల్లోనే పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కనిష్ట స్థాయిలో కేవలం 250 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయబోతోందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
దీనిలో భాగంగానే.వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపునకు రోడ్ మ్యాప్ ను ఖరారు చేసేందుకు ఏకే ఆంటోని నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి ఈ బాధ్యతలను పార్టీ అప్పగించింది.ఈ కమిటీ జిల్లా రాష్ట్ర కమిటీలతో సంప్రదింపులు జరిపి ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను హైకమాండ్ దృష్టికి తీసుకువెళతారు.అనంతరం కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆ నివేదికలను అనుసరించి వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటుపై ఎన్ని స్థానాల్లో బరిలోకి దిగాలనే అంశంపై పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
కాంగ్రెస్ కి బలం లేని చోట ప్రాంతీయ పార్టీలతో మహాకూటమి ఏర్పాటుచేసి బీజేపీయేతర పార్టీలకు ఎక్కువ స్థానాలు సర్దుబాటు చేసేలా తాను తక్కువ సీట్లకే పరిమితం కావాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీకొనేందుకు ఏర్పాటైన మహాకూటమిలో చేరే ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ ప్రాతనిధ్యం కల్పిస్తూ పార్టీ 250 కన్నా తక్కువ స్థానాల్లో పోటీకి పరిమితం కావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండడం బీజేపీలో కలవరం పుట్టిస్తోంది.