తండ్రైన రాహుల్ రామకృష్ణ... కొడుకు పుట్టిన సంతోషంలో కమెడియన్!

అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, జాతి రత్నాలు, RRR వంటి సినిమాలలో కమెడియన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఒకరు.ఈయన వరుస సినిమాలలో కామెడీ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

 Comedian Rahul Ramakrishna Blessed With A Baby Boy Details, Rahul Ramakrishna,co-TeluguStop.com

ఇలా కమెడియన్ గా సినీ కెరియర్లో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈయన సోషల్ మీడియాలో మాత్రం తరచు ఏదో ఒక వివాదాస్పద ట్వీట్లు చేస్తూ వార్తలలో నిలుస్తుంటారు.

ఈయన చేసే పోస్టులన్నీ కూడా కాస్త పరుష పదాలతో ఉండటం వల్ల ఈయన వివాదాలను ఎదుర్కొంటూ ఉంటారు.

ఇకపోతే ఈయన వృత్తిపరమైన జీవితం ఎంతో సక్సెస్ గా ముందుకు సాగుతున్నప్పటికీ ఈయన వ్యక్తిగత జీవితం మాత్రం ఎంతో గంధర గోలంగా ఉంది.గతంలో ఒకసారి ఈయన ఓ అబ్బాయికి కాబోయే భార్య అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోని షేర్ చేయడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ తనకు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఈయన పెళ్లి తేదీని మాత్రం ప్రకటించకపోయినా గత ఏడాది నవంబర్ నెలలో తన భార్య ప్రెగ్నెన్సీగా ఉన్న ఫోటోని షేర్ చేస్తూ త్వరలోనే తండ్రి కాబోతున్నానే విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.ఇలా ఈయన తన భార్య ప్రెగ్నెన్సీ ఫోటోలను షేర్ చేయడంతో అసలు రాహుల్ రామకృష్ణ పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు అటు కొందరు సందేహాలను వ్యక్తపరిచారు.

అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈయన తన కుమారుడు జన్మించారని సినిమా భాషలో సంక్రాంతి రిలీజ్ అంటూ తన కుమారుడి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు.ఈ క్రమంలోనే రాహుల్ రామకృష్ణ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube