ప్రపంచ ప్రాఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.ప్రతిరోజు కోట్ల రూపాయలు స్వామివారికి కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు.
కానీ ఈ మధ్యకాలంలో స్వామి దర్శనం సామాన్య భక్తులకు నరకం ప్రాయంగా మారిపోయిందని స్థానికం సామాజికవేతలు మంగాటి గోపాల్ రెడ్డి, జగన్నాథం నాయుడు, సుధాకర్ రెడ్డి, కన్నారెడ్డి, పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినాలలో స్వయంగా శ్రీవారి దర్శనానికి వెళ్లి క్యూ కాంప్లెక్స్ లో వీరందరూ అనుభవించిన నరకాన్ని మీడియా ముందు వెల్లడించారు.
గతంలో వైకుంఠ ఏకాదశి అంటే రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కలుగజేసే వారిని కానీ ఈ సంవత్సరం పది రోజులు ఏకధాటిగా దర్శనాలు కల్పిస్తామని గొప్పలు చెప్పి వీఐపీల సేవలో తరిస్తూ క్యూ కాంప్లెక్స్ లో భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీటీడీ పాలకమండలి యజమాన్యం అసలు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారా లేక వేరే మతాన్ని ప్రోత్సహిస్తున్నారా అని కూడా ప్రశ్నించారు.ఈ ఏకాదశి పవిత్రమైన రోజులలో టోకెన్లు కట్టుకున్న వారిని ఉసిగొలిపేలా రన్నింగ్ క్యూ అని ప్రచారం చేసి జనాభక్తసంద్రం తరలి వచ్చేలా చేసి వారి అనారోగ్యానికి కారకులవుతున్నారని విమర్శించారు.తిరుపతిలో ఉచిత దర్శనాల కోసం దాదాపు తొమ్మిది కౌంటర్లను ఏర్పాటు చేసి టోకెన్లను జారీ చేసి దర్శన భాగ్యం కల్పించే కోణంలో పూర్తిగా టీటీడీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
10 గంటల తరబడి సామాన్యులను క్యూ కాంప్లెక్స్ దగ్గర వేచి ఉండేలా చేయడం దారుణమని తెలిపారు.అధికారులు ఇకనైనా తీరు మార్చుకొని మరోసారి ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని చెప్పారు.ఇంకా చెప్పాలంటే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని ఏడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.స్వామివారి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతుంది.
ఇంకా చెప్పాలంటే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటలు మాత్రమే సమయం పడుతున్నట్లు సమాచారం.
DEVOTIONAL