తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులను సమర్పిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
అయితే ప్రజాపాలన దరఖాస్తుల ఫామ్ ల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే ప్రజలకు అవసరమైన దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.రైతుభరోసా, పెన్షన్లపై ప్రజలకు ఎటువంటి అపోహలు వద్దని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.