విశాఖపట్నం అనకాపల్లి జోన్ పరిధిలో పలు అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి.బుధవారం ఆమె జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని ఆమె చాంబర్లో అనకాపల్లి జోన్ కార్పొరేటర్లు, జోన్ల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అనకాపల్లి జోన్ లో అభివృద్ధి చేస్తున్న వివిధ పనుల పురోగతిని అధికారుల నుండి వార్డ్ వారీగా అడిగి తెలుసుకొన్నారు.వార్డు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రతి వార్డుకు రూ.1.5 కోట్లు కేటాయించామని ఆయా పనుల పురోగతిని అంతేకాకుండా ఇతర నిధుల నుండి కేటాయించిన పనులను అడిగి తెలుసుకున్నారు.అనకాపల్లి జోన్ కు సంబంధించి త్రాగునీరు, విద్యుత్ దీపాలు, రోడ్లు కాలువలు డ్రైన్లు సామాజిక భవనాలు పట్టణ ఆరోగ్య కేంద్రాలు పారిశుద్ధ్యం తదితర పనులను దశలవారీగా అడిగి తెలుసుకొని, అభివృద్ధి పనులలో ఆటంకాలు ఏమైనా ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకురావాలని తెలియజేస్తూ, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.అలాగే పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి వ్యర్ధాలు ఎక్కడ లేకుండా చూడాలని అనకాపల్లి జోన్ లో పారిశుధ్యం పై అధికంగా ఫిర్యాదులు వస్తున్న ప్రత్యేక దృష్టి సాధించాలని, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నగరంలో ప్లాస్టిక్ నిర్మూలన కు దృష్టిసారించి ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేయాలని ప్రజా ఆరోగ్యం అధికారులను ఆదేశించారు.
వార్డులలో పెండింగ్ లో ఉన్న పనులను వార్డు కార్పొరేటర్లు మేయర్ దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులను ఆయా పనులపై దృష్టి కేంద్రీకరించి సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి జోన్ కార్పొరేటర్లు కొణతాల నీలిమ, పీలా లక్ష్మీ సౌజన్య, మండపాటి సునీత, జాజుల ప్రసన్నలక్ష్మి, చిన్న తల్లి, జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, సూపర్డెంట్ ఇంజనీర్ వర్క్స్ రామ్మోహన్రావు, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ కుమార్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి, సుధాకర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.