తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy ) తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే క్యాబినెట్ బేటి నిర్వహించి తొమ్మిదవ తారీకు నాడు సోనియా గాంధీ పుట్టినరోజు నాడు మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ కి సంబంధించి పథకం అమలు చేయడం జరిగింది.
ఒకపక్క ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరోపక్క పాలనపరంగా ప్రక్షాళన చేస్తూ ఉన్నారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ( BRS )హయాంలో నియమితులైన కొంతమంది ప్రభుత్వం సలహాదారులను తొలగించడం జరిగింది.
అంతేకాదు పలు కార్పోరేషన్ చైర్మన్ పదవుల నియామకాలు కూడా రద్దు చేయడం జరిగింది.
ఇక తాజాగా TSPSC పై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టడం జరిగింది.
ఈ క్రమంలో సోమవారం TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయగా నేడు అయిదుగురు సభ్యులు రాజీనామా చేశారు.ఈ క్రమంలో TSPSC ప్రక్షాళన చేయటానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడానికి రెడీ కావడం జరిగిందట.UPSC… ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయమని పేర్కొన్నారు.ఆ తర్వాత ఓ నివేదిక సిద్ధం చేసి సుప్రీమ్ గైడ్ లైన్స్ ప్రకారం నియామకాలు పారదర్శకంగా ఉండేలా చూడాలని అధికారులకు తెలియజేశారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా.చైర్మన్, సభ్యుల నియామకం ఉండాలన్నారు.
ఇదే సమయంలో పేపర్ లీక్ లు, కేసుల పురోగతి, నియామకాల తాజా స్థితి, పరీక్షల నిర్వహణ.నియామకాలు వంటి వాటిపై నేటి సమీక్షలో చర్చించడం జరిగింది.