నేడు రేపు తెలంగాణ కాంగ్రెస్ ( Telangana congress )ర్ఎస్, బిజెపిలోని అసంతృప్త నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునే వ్యూహానికి తెరతీసింది.దీనిలో భాగంగానే తెలంగాణలో కీలక నేతగా గుర్తింపు పొందిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరావు నేడు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.
సి డబ్ల్యూ సి సమావేశాల విరామ సమయంలో ఈరోజు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా , రాహుల్ గాంధీ సమక్షంలో తుమ్మల నాగేశ్వరావు కాంగ్రెస్ లో చేరబోతున్నారు.ఇప్పటికే తుమ్మలను పార్టీలోకి రావాల్సిందిగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ( Revanth Reddy ) సీఎల్పీ నేత మల్లు బట్టు విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ కోర్ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) వంటి వారు ఆయనను ఆహ్వానించారు.

నిన్ననే హైదరాబాదులోని తుమ్మల నాగేశ్వరావు ( Tummala Nageswara Rao )నివాసానికి కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే తో పాటు, రేవంత్ రెడ్డి , భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు.కాంగ్రెస్ లో చేరాల్సిందిగా మరోసారి ఆయనను ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వారికి తెలిపారు.సిడబ్ల్యుసి సమావేశాలు సందర్భంగా అనేకమంది నేతలు , మాజీ మంత్రులు ,మాజీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సమాచారం.
వాస్తవంగా ఈనెల 17న తుక్కుగూడ కాంగ్రెస్ సభ వేదికలో ఆయన పార్టీలో చేరాలని నిర్ణయించినప్పటికీ , కొన్ని కారణాల వల్ల దానిని ఈరోజుకు మార్చినట్లు సమాచారం.

తుమ్మల తో పాటు మరికొంతమంది కీలక నేతలు సిడబ్ల్యుసి సమావేశాల విరామ సమయంలో పార్టీలో చేరనున్నారు.వీరిని సోనియా రాహుల్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇక కాంగ్రెస్ లో చేరి పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరావు పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ ఆయనకు ఖమ్మం అసెంబ్లీ టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది.
సీటు విషయంలో మరికొన్ని రోజుల్లో క్లారిటీ రాబోతోంది.