అవును, మీరు విన్నది నిజమే.తాజాగా బిహార్ రాష్ట్రానికి( Bihar ) చెందిన ఓ న్యూస్ యాంకర్( News Anchor ) తాలూకు వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజనం ఆ వీడియో పైన ఫైర్ అవుతున్న పరిస్తితి.
లైవ్ న్యూస్‌లో ఆ యాంకరమ్మా చేసిన పనికి నెటిజన్లు బాగా ఏసుకుంటున్నారు.ఇంతకీ ఆ యాంకరమ్మా లైవ్‌లో ఏం చేసింది? ఆమెను నెటిజన్లు ఎందుకిలా ఏకిపారేస్తున్నారు? అనేగా మీ అనుమానం.
వివరాల్లోకి వెళితే, ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీలో పని చేస్తున్న ఆ యాంకరమ్మా.అక్కడి భాగమతి నది కారణంగా పొటెత్తిన తీవ్రమైన వరదల తాలూకు న్యూస్‌ను( Floods ) లైవ్‌లో చదవడం స్టార్ చేశారు.
ఈ క్రమంలో స్టూడియో నుంచి వార్త చదువుతూ యాంకర్ తప్పు పదం పలికి, నవ్వడం ( Laughing ) మొదలు పెట్టింది.అంటే ఒక విషాదకర వార్త చదువతూ లైవ్‌లో నవ్వేసిందా యాంకరమ్మా.
ఈ వీడియో కాస్తా బయటకు రావడంతో ఇపుడు ఆ న్యూస్ వైరల్‌గా మారింది.దాంతో న్యూస్ యాంకర్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అక్కడ జనాలు చచ్చిపోతుంటే నీకు నవ్వులాటగా ఉందా? అంటూ ఏకిపారేస్తున్నారు.మరికొంతమంది అయితే జర్నలిస్టులు ( Journalists ) బాధ్యతగా వుండాల్సింది పోయి ఇలా చావు వార్తలను కామెడీగా తీసుకుంటున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు.కాగా, ఆమెపైన విమర్శలు చాలా తీవ్ర స్థాయిలో వస్తున్నాయి అని పసిగట్టిన ఆమె ఆ తర్వాత దీనిపై క్షమాపణలు కోరడం జరిగింది.
కాగా బిహార్‌లో 32 మంది విద్యార్థులతో పాఠశాలకు వెళ్తున్న పడవ భాగమతి నదిలో( Bhagamati River ) బోల్తా పడిన వార్త గురించి మీకు తెలిసే వుంటుంది.ఈ ఘటనలో 14 మంది ఆచూకీ గల్లంతైంది.ముజఫర్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పక్క గ్రామంలో ఉన్న పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు పడవలో భాగమతి నది దాటి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.