ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో టీడీపీ తీవ్ర కసరత్తు చేస్తుంది.ఈ మేరకు వచ్చే నెల నుంచి భారీ బహిరంగ సభలను నిర్వహించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా కుప్పం నియోజకవర్గంపై టీడీపీ బాస్ ఫోకస్ పెట్టారు.ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఆయన కుప్పంలో విస్తృతంగా పర్యటించనున్నారు.ఇవాళ సాయంత్రం గంటలకు కుప్పంకు చంద్రబాబు చేరుకోనున్నారు.అక్కడి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులతో సమావేశం కానున్న చంద్రబాబు గుడిపల్లిలో బహిరంగ సభకు హాజరుకానున్నారు.రేపు నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మరియు రామకుప్పం మండలాల్లో ఆయన పర్యటించనున్నారు.ఈ రెండు మండల కేంద్రాల్లోనూ పబ్లిక్ మీటింగ్ లు ఏర్పాటుచేయనున్నారు.అదే రోజు సాయంత్రం జనసేన నేతలతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం కానున్నారు.30వ తేదీన గంగమ్మ ఆలయాన్ని సందర్శించనున్న చంద్రబాబు మధ్యాహ్నం కుప్పంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభిస్తారు.అదేరోజు కుప్పం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరపనున్నారు.తరువాత ముస్లిం మైనార్టీలతో సమావేశంకానున్న చంద్రబాబు అక్కడ బహిరంగ సభలో పాల్గొననున్నారు.