చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర పర్యటన ఇటు ప్రజలకు గానీ పార్టీకి గానీ ప్రయోజనం లేకుండా పోయిందని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు.ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బషీర్బాగ్ ఘటనలో ఏం జరిగిందో ప్రజలు మర్చిపోలేదని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రలో టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ చంద్రబాబు నాయుడు అమరావతి పైన ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు.ఉత్తరాంధ్ర పై ఎందుకు ద్వేషమో ఆయన సమాధానం చెప్పాలని అన్నారు.
మూడు రాజధానులు వద్దు ఒక రాజధాని ముద్దు అన్న చంద్రబాబు ఉత్తరాంధ్రలో లో ఎలా పర్యటిస్తారు వారికి చిత్తశుద్ధి ఉంటే విశాఖ జిల్లా లోని ఉన్న వారి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు