నాడు చంద్రబాబు ప్రతిపక్షం లో వుంటూ ముఖంలో ఏనాడు నవ్వు గాని చిర్నవ్వు గాని లేకుండా ఉండడం బాబుకు అలవాటు.నాటి ముఖ్యమంత్రి వై యస్ సభలో ఏమయ్యా చంద్రబాబు కాస్తా నవ్వవయ్యా ,నవ్వడం ఒక యోగం నవ్వించడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం అని చమత్కరించారు.
దాంతో ఒక్కసారి సభలో నవ్వులు రువ్వబడ్డాయి.అప్పుడు బాబు సన్నగా నవ్వి ఊరుకున్నారు.
అయితే నాటి చమత్కారాన్ని జ్ఞాపకం పెట్టుకుని నేడు జగన్ కు బదులిచ్చినట్టు నవ్వడం మానసిక రోగమన్నారు.నవ్వడం ఆరోగ్యం కానే కాదు ప్రతిపక్షానికి అంటుకున్న మానసిక రోగమే.
లేకుంటే నేను సభలో మాట్లాడుతుంటే నా మాటలు అర్ధం చేసుకోలేని స్థితిలో నవ్వుతున్నారను కుంటున్నాను.కాదంటే మానసిక రోగమైన ఏర్పడి ఉండాలి అని చంద్రబాబు సభలో ప్రతిపక్షాన్ని విమర్శించారు.
నవ్వులెలా ఉన్న మనం మన బాధ్యతలు నిర్వర్తించాలి కనుక మరి పట్టించుకోవద్దు.కావాలంటే వారికి చికిత్స చేయించమంటే చేయించగలమని బాబు ఈ సందర్భంగా నవ్వుతూ చెప్పారు.
వాస్తవానికి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారపక్షం పై నవ్వులు రువ్వడం ఆయనతోనే ఆరంభం అయ్యిందనే చెప్పాలి –యర్నాగుల సెటైర్స్
.