ఏపీ అధికారులతో కేంద్ర ఎన్నికల కమీషన్ సమావేశం కానుంది.ఈ మేరకు ఈనెల 23వ తేదీన ఈ సమావేశం జరగనుండగా ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై ఈసీ కీలక చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రానికి రానుందని తెలుస్తోంది.ఇందులో భాగంగా రేపటి నుంచి ఏపీలో ఈసీ అధికారుల బృందం పర్యటించనుంది.
తరువాత అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఈసీ చర్చించనుంది.కాగా ఫిబ్రవరిలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.