తెలంగాణలో రైతుల కోసం బీజేపీ( BJP ) సమరభేరీ మోగించింది.కాంగ్రెస్ ( Congress )ప్రభుత్వం రైతు విధానాలను వ్యతిరేకిస్తుందని ఆరోపిస్తూ కమలనాథులు సత్యాగ్రహ దీక్షకు శ్రీకారం చుట్టింది.
ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద బీజేపీ నేతలు సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నారు.ఇందులో ప్రధానంగా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.వరి ధాన్యం క్వింటాల్ కు రూ.500 బోనస్ వెంటనే ఇవ్వాలని పేర్కొంది.రెండు లక్షలలోపు బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని, కరవుతో నష్టపోయిన రైతులకు రూ.25 వేల నష్టపరిహారాన్ని అందించాలని కోరుతున్నారు.అదేవిధంగా రైతు కూలీలకు రూ.12 వేలను బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని, రైతు భరోసా ద్వారా రూ.15 వేలను రైతులకు అందించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.