హౌస్ నుంచి వచ్చిన యాంకర్ శివ రచ్చ రచ్చ.. క్లాస్ పీకిన మహిళ పోలీస్!

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ ఇటీవల తాజాగా ముగిసిన విషయం తెలిసిందే.బిగ్ బాస్ ఓటిటి తొలి సీజన్ విన్నర్ గా బిందుమాధవి గెలిచిన విషయం తెలిసిందే.

 Bigg Boss Telugu Non Stop Police Warns Anchor Shiva After Out Bigg Boss House ,-TeluguStop.com

అంతేకాకుండా గతంలో ఎప్పుడు లేని విధంగా తొలిసారిగా బిగ్ బాస్ టైటిల్ ను ఒక మహిళా విజేత గెలుచుకుంది.ఇక రన్న రప్ గా అఖిల్ సార్థక్ నిలిచిన విషయం తేలిసిందే.

హౌస్ లో చివరి వరకు కూడా బిందు మాధవి, అఖిల్ సార్థక్, యాంకర్ శివ,అరియానా, బాబా భాస్కర్, మిత్ర శర్మ లు పోటీ పడిన విషయం తెలిసిందే.ఇక టాప్ త్రీ ప్లేస్ లో యాంకర్ శివ నిలిచాడు.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కంటెస్టెంట్‌ హావా మామూలుగా ఉండదు.కాంటెస్టెంట్ ల అభిమానులు భారీగా తరలి వచ్చి తమ ఫేవరెట్‌ కంటెస్టెంట్‌కు నీరాజనాలు పలుకుతుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా యాంకర్ శివ అభిమానులు రోడ్డుపై భారీగా తరలివచ్చి నీరాజనాలు పలికారు.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన యాంకర్‌ శివ కోసం అతడి ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వాగతం పలికారు.

దీంతో శివ ఓపెన్‌ టాప్‌ కారులో తన ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు.ఈ క్రమంలో శివ ఫ్యాన్స్‌ కారు వద్దకు చేరి నానా హంగామా చేశారు.

కారు చూట్టు ముట్టి కారును ముందుకు కదలకుండా చేశారు.

అంతేకాదు పెద్ద ఎత్తున అరుస్తూ రచ్చ చేశారు.దీంతో ఆ ప్రదేశంలో తీవ్ర ట్రాఫిక్‌ సమస్య నెలకొంది.శివ కారు కారణంగా వెనకాలే వస్తున్న కార్లు కూడా ముందుకు కదలని పరిస్థితి ఏర్పడడంతో పోలీసులు రంగంలోకి దిగి యాంకర్‌ శివకు క్లాస్‌ పీకారు.

ఇలా కార్‌ టాప్‌ మీదకు రావడం కరెక్ట్‌ కాదని, మీరు లోపల కూర్చొని ఇక్కడి నుంచి వెళ్లాలని ఓ మహిళ పోలీసు అధికారిని శివను వారించారు.అంతేకాదు మీ వల్ల ట్రాఫిక్‌ జామ్‌ అవుతుందని, తొందరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు శివను వారించినట్లు సమాచారం.

దీంతో యాంకర్ శివ కారు లోపల కూర్చొని వెళ్ళిపోయాడు.కాగా గతంలోనూ పలువురు కంటెస్టెంట్స్ ఇలాగే రచ్చ చేయడంతో పోలీసులు వారిని మందలించిన సంగతి తెలిసిందే.ఇందుకు సంబందించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube