Bigg Boss Sohel : బిగ్ బాస్ డబ్బులతో చెల్లి పెళ్లి చేశా.. పక్కోడి కోసం గొడవపడతా.. బిగ్ బాస్ సోహెల్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ షో( Bigg Boss Show ) ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకోవడం సులువైన విషయం కాదు.అలా పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో బిగ్ బాస్ సోహెల్( Sohel ) కూడా ఒకరు.బూట్ కట్ బాలరాజు ప్రమోషన్స్ లో భాగంగా సోహెల్ బిగ్ బాస్ షో డబ్బులతో చెల్లి పెళ్లి చేశానని తెలిపారు.17 లక్షల రూపాయలు టీడీసీ కట్ అయ్యి ఫ్రైజ్ మనీ వచ్చాయని వీక్లీ రెమ్యునరేషన్ తో ల్యాండ్ కొన్నానని వెల్లడించారు.

 Bigg Boss Soehl Comments About His Remuneration Details Here Goes Viral-TeluguStop.com

బూట్ కట్ బాలరాజు( BootCut Balaraju ) సినిమాకు కో ప్రొడ్యూసర్ గా పని చేశానని ఆయన పేర్కొన్నారు.పక్కోడి కోసం నేను గొడవ పడతానని నాకు తెలిసిన వాళ్లకు కష్టం కలిగితే నేను అస్సలు తట్టుకోలేనని సోహెల్ వెల్లడించారు.

నేను ఇంకెప్పుడు మారతానో నాకు అర్థం కావడం లేదని సోహెల్ పేర్కొన్నారు.పెద్ద బ్యానర్ల నుంచి నాకు ఆఫర్లు రాలేదని ఆయన అన్నారు.ఎస్వీ కృష్ణారెడ్డి( SV Krishna Reddy ) నుంచి తప్ప ఎవరి నుంచి ఆఫర్ రాలేదని సోహెల్ వెల్లడించారు.

ఈరోజు థియేటర్ వరకు నాకోసం 100 మంది వస్తున్నారంటే అక్కడే నేను సక్సెస్ అయినట్టేనని ఆయన అన్నారు.కథల విషయంలో ఓన్ జడ్జిమెంట్ ఉంటుందని ఎవరిపై ఆధారపడలేదని సోహెల్ తెలిపారు.రిజల్ట్ పరంగా మిస్టర్ ప్రెగ్నెంట్( Mr.Pregnant Movie ) బెస్ట్ అని ఆయన అన్నారు.ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అయిందని సోహెల్ కామెంట్లు చేశారు.

నా బడ్జెట్, మార్కెట్ ఆ సినిమా వల్ల తెలిసిందని సోహెల్ పేర్కొన్నారు.

బూట్ కట్ బాలరాజు కలెక్షన్లు పుంజుకున్నాయని ఆయన తెలిపారు.ప్రతి ఒక్కటీ అనుభవం అని ఆ అనుభవం ఆధారంగా ముందుకెళ్లాలని సోహెల్ తెలిపారు.యాక్టర్, పొలిటీషియన్ స్పీచ్ ప్రిపేర్ అయ్యి రావాలని ఆయన వెల్లడించారు.

కొన్ని పెద్ద బ్యానర్ల కోసం ట్రై చేసినా ఆశించిన ఆఫర్లు రాలేదని సోహెల్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube